ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళన

dharna at Inter board
dharna at Inter board


హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని కలిసేందుకు వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఐతే వారికి కార్యదర్శి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై విద్యార్ధి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. దీంతో ఆందోళన దిగిన ఏబివిపి కార్యకర్తలను పోలీసుల అరెస్టు చేశారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం, విద్యార్ధుల ఆత్మహత్మలపై తక్షణమే సియం కేసిఆర్‌, కేటిఆర్‌ స్పందించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/