అక్రమ కొనుగోళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

ఏనుమముల వ్యవసాయ కమిటి చైర్మన్‌

mirchi formers
mirchi formers

వరంగల్‌: తెలంగాణలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో వ్యవసాయ మార్కెట్‌లు అన్ని మూత పడ్డాయి. దీంతో పండించిన పంటను వారి వారి గ్రామాలలోనే కొనుగొలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది వ్యాపారులు అక్రమ కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన వరంగల్‌ జిల్లా ఏనుమముల వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ చింతా సదానందం అక్రమ కొనుగొళ్లకు పాల్పడుతున్న వారిపై కఠన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్‌ ఏనుమములు వ్యవసాయ మార్కెట్‌ బంద్‌ ఉన్న కారణంగా రైతుల కల్లాల్లోనే వ్యపారులు మిర్చి పంటను అక్రమ కొనుగోళకలకు పాల్పడుతున్నారు. ప్రతి మిర్చి రైతు కోల్డ్‌స్టోరేజిలో పంటను భద్ర పరుచుకుంటే రైతుబందు ద్వారా ప్రభుత్వ రుణం ఇస్తుందన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు తమ పంటలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/