స్టెంట్ల తయారీ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ

TS Miunster T.Rajendar
TS Miunster T.Rajendar

Sangareddy: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో స్టెంట్ల తయారీ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో స్టెంట్ల తయారీ పరిశ్రమ నిర్మాణానికి మంత్రులు ఈటల రాజేందర్‌, మల్లారెడ్డిలు శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమను ఎస్‌ఎంటీ సంస్థ స్థాపిస్తోంది. పరిశ్రమ 3వేల మందికి ఉపాధి కల్పించనుంది.