రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి

Nagi Reddy
Nagi Reddy

హైదరాబాద్‌: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు.సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏడు చోట్ల ఇబ్బందులు తలెత్తాయన్న నాగిరెడ్డి.. ఈనెల 27న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. 123 ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని.. ఒక్కో ఎంపీటీసీకి రెండు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/