శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు విశేష స్పందన

2.4లక్షల లడ్డూల విక్రయాలు

Srivari laddu prasadam sales
Srivari laddu prasadam sales

Tirumala: తిరుమల  శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశేష స్పందన లభిస్తోంది

విక్రయాలు ప్రారంభించిన మూడు గంటల వ్యవధిలోనే 2.4లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయి.

గుంటూరు మినహా మిగిలిన 12 జిల్లాలో లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిపారు.

గుంటూరుజిల్లాలో టిటిడి కళ్యాణమండపం రెడ్ జోన్ పరిధిలో వుండడంతో 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. రేపు మరో 2 లక్షల లడ్డూ ప్రసాదాలను జిల్లా కేంద్రాలకు టీటీడీ తరలించనున్నది. 

తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారి లడ్డూలు విక్రయించాలని భక్తులు నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.  ప్రతి రోజు తమిళనాడు కు లక్ష లడ్డూలు, తెలంగాణ కి 50 వేలు లడ్డూలు తరలించే యోచనలో టిటిడి ఉంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/