సింగరేణి సిఎండి శ్రీధర్‌కు మరో అంతర్జాతీయ అవార్డు

sridhar, singareni cmd
sridhar, singareni cmd


హైదరాబాద్‌: సింగరేణి సిఎండి ఎన్‌ శ్రీధర్‌ను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. బ్రిటన్‌కు చెందిన అచీవ్‌మెంట్స్‌ ఫోరం శ్రీధర్‌ను మేనేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును ఎన్‌ శ్రీధర్‌ …శుక్రవారం లండన్‌లో అందుకున్నారు. సృజనాత్మక, వినూత్న, అసాధారణ నాయకత్వంతో సంస్థను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు చేర్చినందుకు గుర్తింపుగా శ్రీధర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ పందర్భంగా మాట్లాడిన శ్రీధర్‌..సింగరేణీయుల సమిష్టి కృషితోనే అభివృద్ధి పథంలో సింగరేణి సంస్థ ఉందన్నారు. ఈ అవార్డును సింగరేణి కార్మికులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/