‘సీతారామ’ పనుల జాప్యంపై సిఎంఓ ఆగ్రహం

Smita Sabharwal
Smita Sabharwal

భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యంపై తెలంగాణ రాష్ట్ర సిఎంఓ ప్రత్యేక అధికారిణి స్మితా సబర్వాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు గుత్తేదారు, కంపెనీ ప్రతినిధులు, అధికారులు తీరుపై ఆమె మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు పర్యటించిన స్మితా సబర్వాల్‌ అశ్వాపురం మండలంలోని కొత్తూరు గ్రామంలో సీతారామ సాగునీటి పనుల్ని పరిశీలించారు. వారిపని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. హెలికాప్టర్‌ ద్వారా మణుగూరు చేరుకున్న స్మితా సబర్వాల్‌ పోలీసు బందోబస్తు మధ్య అశ్వాపురం చేరుకున్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/