ఆర్టీసిలో యూనియన్లు ఉండాలా! వద్దా?

ఆర్టీసి జేఏసి ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి

Ashwathama reddy
Ashwathama reddy

హైదరాబాద్‌: ఆర్టీసిలో యూనియన్లు ఉండాలా? వద్దా? అని ఆర్టీసి జేఏసి ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. రెండేళ్లపాటు యూనియన్లు వద్దని ఆర్టీసి కార్మికులతో సంతకాలు చేయించడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ విషయంపై రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని, అధిక మొత్తంలో ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహిళల పని వేళల విషయంలో సిఎం కెసిఆర్‌ ఆదేశాలను కూడా అధికారులు ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలో 3,500 బస్సులు తిరుగుతుండగా, వాటిలోంచి వెయ్యి బస్సులను రద్దు చేయడం అన్యాయమని అశ్వత్థామరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. సమ్మె జరిగే సమయంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/