రాష్ట్ర సరిహద్దుల్లోని వారికి ఆరోగ్య తనిఖీలు చేపట్టి స్వస్థలాలకు పంపండి

హైకోర్టు ఉత్తర్వులు జారీ

People at AP Border

Amaravati:   హైదరాబాద్ నుంచి ఎపిలోని స్వస్థలాలకు వెళ్లేందుకు ఎన్ వో సి లు తీసుకున్న వారికి హైకోర్టు ఊరట కలిగించే ఆదేశాలు జారీ చేసింది..

 రాష్ట్ర సరిహద్దులలో వారికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని, సంపూర్ణ ఆరోగ్య వంతులను స్వస్థలాలకు పంపాలని, అనుమానం ఉంటే వారిని క్వారంటైన్ కు పంపాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది..

అలాగే  క్వారంటైన్ అవసరం లేకపోతే  గృహనిర్బంధంలో ఉంచాలని కోరింది.  రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింద.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/