మెట్రోస్టేష‌న్ల‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

self driving cars
self driving cars

హైదరాబాద్ : ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రోస్టేషన్లలో అద్దెకార్లు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిలో అద్దె ప్రాతిపాదికన నడిచే బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను మియాపూర్ స్టేషన్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. అయితే అతి చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చారు. కేవలం గంటకు రూ.40 మాత్రమే చార్జి చేస్తున్నారు. మొట్టమొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలు అధికారులు దశల వారీగా ఇతర స్టేషన్లకు విస్తరించనున్నారు. 

అయితే వీటిని మియాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మాదాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నారు. మియాపూర్ మెట్రోస్టేషన్లో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి వీటిని ఉపయోగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనికోసం జూమ్‌కార్‌తో మెట్రోసంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన వాహనాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణికుడు ముందుగా జూమ్‌కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం కార్‌లాక్ అన్‌లాక్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.