విత్తనాల సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలి

సీడ్స్ ఉత్పత్తిదారుల వినతి

Seeds Transport

Hyderabad: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విత్తనాలు ( సీడ్స్ ) సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు.

మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ ను కలిసిన విత్తన ఉత్పత్తి దారులు  లాక్ డౌన్ వల్ల తమకు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ రవాణా పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని  తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 400 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, సుమారు మూడు లక్షల మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఉన్నారని వారు వివరించారు

. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు ప్రాసెస్ చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు సరఫరా చేస్తున్నామని వారు పేర్కొన్నారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/