ఆస్తి పన్ను వసూళ్లలో గతేడాది కంటే అధికం

GHMC
GHMC

సికింద్రాబాద్‌: ఆస్తి పన్ను చెల్లింపుదారుల కోసం జీహెచ్‌ఎంసీ ఎర్టీబర్డ్‌ పథకం ప్రకటించింది. సుమారు నెలరోజుల పాటు అమలులో ఉన్న ఎర్లీబర్డ్‌ పథకం ద్వారా జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 17వేల 305 మంది ఆస్తిపన్ను చెల్లింపుదారుల నుంచి ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేశారు. అంతేకాక కాలనీలు, బస్తీలలో సాఫ్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్ కార్యక్రమం పట్ల ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ఆస్తిపన్ను వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్కిల్ కార్యాలయంలో చెల్లింపుదారులకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లించే అవకాశంతో పాటు బిల్‌కలెక్టర్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించారు. గతేడాది కంటే అధికంగా ఆస్తిపన్ను వసూలు చేశారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/