కరోనా …31 వరకు స్కూళ్లు, థియేటర్లు బంద్‌

రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని చర్చ

cm kcr
cm kcr

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరనా వైరస్‌పై సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది. కరోనా విస్తరణను అరికట్టే క్రమంలో రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో మరింత లోతుగా చర్చించి ప్రకటన చేస్తారని సమాచారం. కాగా, హైలెవల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిఎం కెసిఆర్‌ క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాకు వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక, తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, పదో తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు సిఎం కెసిఆర్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కరోనాపై వైద్య అధికారులకు సిఎం కెసిఆర్‌ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతున్నట్టు గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/