నిజామాబాద్‌లో స్కూల్‌ బస్సు భీభత్సం

బస్సులో 20 మందికి పైగా విద్యార్థులు

School bus accident in nizamabad
School bus accident in nizamabad

నిజామాబాద్‌: జిల్లాలోని నల్లవెల్లి దగ్గర ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. డిచ్‌పల్లికి చెందిన విద్యా పబ్లిక్‌ స్కూల్‌ సంబంధించిన బస్సు డ్రైవరు అతివేగం కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును బస్సు వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవరుతో సహా విద్యార్థులందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తలించారు. అయితే ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడి స్థానికులు గ్యాస్‌ కట్టర్‌ సాయంలో ఇంజిన్‌ను తొలగించి విద్యార్థిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/