కేసిఆర్‌ భవిష్యత్‌లో జైలుకు పోక తప్పదు!

Sampath Kumar
Sampath Kumar, congress leader

హైదరాబాద్‌: తెలంగాణ సియం కేసిఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేసిఆర్‌..అసెంబ్లీని రాజరికపు, కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని, ప్రశ్నించే వారిని కేసిఆర్‌ అణిచివేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడిందని, ప్రజలు సొమ్మును రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసిఆర్‌ భవిష్యత్‌లో జైలుకు పోక తప్పదని ఆయన అన్నారు.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/