సమత కేసులో ఇవాళే తుది తీర్పు

adilabad district court
adilabad district court

ఆసిఫాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు ఈ నెల 20 నే పూర్తి అయ్యాయి. వాస్తవానికి 27న తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 30 కు దానిని వాయిదా వేశారు. కాగా గత సంవత్సరం నవంబర్‌ 24 న కొమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లపటార్‌ శివారులో సమతను అత్యంత దారుణంగా అత్యాచారం హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న షేక్‌బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ ముగ్దుంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సమత తల్లిదండ్రులు దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కలిగించిన దిశ హత్యాచారం కేసులో నిందితులను హైదరాబాద్‌ శివారులో ఎన్‌ కౌంటర్‌ చేసిన చంపారు. అదేవిధంగా తన కూతురు విషయంలో కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/