కంటోన్మెంట్‌ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా

TS RTC

Hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఇవాళ అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులుధర్నా నిర్వహించారు. డిపో ముందు భారీ సంఖ్యలో కార్మికులు బైఠాయించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/