ఆర్టీసి కార్మికులు ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు

Rtc strike
Rtc strike

హైదరాబాద్‌: ఆర్టీసి కార్మికులు “ఛలో ట్యాంక్‌బండ్‌” కార్యక్రమంలో జరిగిన ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆ ఆందోళనలో గాయపడ్డవారి ఫోటోలు, పేర్లు, వారి నంబర్లు, హోదాలు తదితర వివరాలను యూనియన్‌ కార్యాలయానికి పంపాలని, ఆర్టీసి జేఏసి కార్యాలయానికి పంపాలని జేఏసి కో కన్వీనర్‌ కె.రాజిరెడ్డి కోరారు. ఫోటోల వెనుక భాగంలో బాధితుల పూర్తి వివరాలను కూడా రాయాలని ఆయన సూచించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/