తెలంగాణలో రేపటి నుంచి రోడ్డుపైకి ఆర్టీసీ బస్సులు

50 శాతం ప్రయాణికులకు మాత్రమే

RTC buses in Telangana
RTC buses in Telangana

Hyderabad : తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాకడౌన్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు రేపటి అందుబాటులోకి రాబోతున్నాయి.

అయితే బస్సుల్లో 50 శాతం ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా అన్ని జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులను జేబీఎస్‌ వరకే అనుమతించనున్నారు.

వరంగల్‌ వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి, నల్గొండ వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి అలాగే మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌ నుంచి ప్రయాణించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

అయితే ప్రస్తుతానికి అంతర్‌రాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఇక ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావాలంటే డిపోల్లో థర్మల్‌ స్క్రీన్‌ తప్పని చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అన్ని డిపోల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిమిత రూట్లలో పరిమితంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం చూస్తోంది.

కేంద్ర సడలింపుల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు.

ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చించారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించి ప్రభుత్వం  నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతర్‌రాష్ట్రబ స్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/