బోల్తాపడి ఆర్టీసీ బస్సు..35 మందికి గాయాలు

RTC Bus Accident
RTC Bus Accident

హైదరాబాద్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్‌ మండలంలో ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే బస్సు గోదావరిఖని నుండి భూపాలపల్లి వెళ్తుండగా సోమన్‌పల్లి వంతెన వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మహదేవ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/