గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి మోహన్‌ భగవత్‌

Mohan Bhagwat
Mohan Bhagwat

హైదరాబాద్: ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ సెప్టెంబర్ 12న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించే సామూహిక గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి హాజరుకానున్నారు. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. సెప్టెంబర్ 12న అనంత చతుర్థశి నాడు జరిగే వినాయక నిమజ్జనోత్సవ ఊరేగింపు బాలాపూర్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. శాలిబండ, చార్మినార్ మీదుగా వినాయకసాగర్(హుస్సేన్ సాగర్)కు ఊరేగింపు చేరుకుంటుందని ఆయన చెప్పారు. ఎంజె మార్కెట్ వద్ద సాయంత్రం 3.304.30 గంటల మధ్య మోహన్ భగవత్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారని ఆయన వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో పాటు ప్రజ్ఞా మిషన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రజ్ఞానానాజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాలకు పూజలు చేస్తారని ఆయన తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/