వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆభరణాలు మాయం

అమ్మవారి పుస్తెలతాడు, ముక్కుపుడక, వెండి గొడుగు దోపిడీ

Baddi Pochamma
Baddi Pochamma

వేములవాడ: ప్రముఖ దేవాలయం వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో కలకలం చోటు చేసుకుంది. అమ్మవారి ఆభరణాలు మాయం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. పోచమ్మ అమ్మవారి 2.5 గ్రాముల పుస్తెల తాడు, ముక్కు పుడక, కిలో వెండి గొడుగు మాయమయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆలయంలో పూజారులు వంతుల వారీగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో ఎవరో బంగారు ఆభరణాలను నొక్కేసినట్లు తెలుస్తోంది. పూజారుల మార్పిడి క్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది. పూజారులకు నోటీసులు జారీ చేశామని, విచారణ చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/