టిప్పర్ డ్రైవర్ మృతి

Road Accident
Road Accident

Khamam: ఆగి ఉన్న బొగ్గు టిప్పర్‌ను.. మరో టిప్పర్ ఢీకొనడంతో ఒక టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెనుబల్లి బైపాస్ రోడ్డులోని ఓ పెట్రోల్‌ బంకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పెట్రోల్ బంకు సమీపంలో ఆగి ఉన్న బొగ్గు టిప్పర్‌ను మరో బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బొగ్గు టిప్పర్ డ్రైవర్‌ శీలం చెన్నారావు(25) అక్కడికక్కడే మృతి చెందాడు.