బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: లోక్‌సభలో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందని ఆయన అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగాలకు ప్రోత్సాహం అందించే ఎలాంటి పథకాలూ లేవని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.1 పన్ను చెల్లిస్తే తిరిగి రూ.2 చెల్లిస్తున్నారని.. బిహార్‌ రూ.1 పన్ను ఇస్తే తిరిగి రూ.1 ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆదాయపన్నులో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోడి చేతిలో కీలుబొమ్మే అని రేవంత్‌ విమర్శించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/