కెసిఆర్‌, కెటిఆర్‌ శాఖలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి

కెసిఆర్‌ పాలనలో తెలంగాణ కుళ్లిపోయింది

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ పాలనలో తెలంగాణ కుళ్లిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందడం లేదనే విషయాన్ని తాము లేవనెత్తుతూనే ఉన్నామని… ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన నివేదికల ద్వారా స్పష్టంగా చెప్పారని అన్నారు. గత ఐదేళ్లలో శాఖల పనితీరుపై ప్రధాన కార్యదర్శి ర్యాంకులు ఇచ్చారని… ఈ ర్యాంకుల్లో కెసిఆర్‌ ,
కెటీఆర్ నిర్వహించిన శాఖలు అట్టడుగు స్థానంలో ఉన్నాయని చెప్పారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని… వారి స్థానంలో ఐఏఎస్ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై యాడ్ వేసుకుంటే… అది టీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పదనంగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. అవార్డులు, రివార్డులను కొనుక్కుంటూ గొప్పగా గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/