ఎమ్మెల్యె చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

పౌరసత్వం రద్దుపై 8 వారాలపాటు స్టే

Chennamaneni Ramesh
Chennamaneni Ramesh

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు వేములవాడ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యె చెన్నమనేని రమేశ్‌కు ఊరటనిచ్చింది. చెన్నమనేని జర్మనీ, భారతీయ పౌరసత్వాలు కలిగి ఉన్నాడని ఆది శ్రీనివాస్‌ అనే నాయకుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా ఈ వివాదం కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్లింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై సవాల్‌ చేస్తూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నారని పిటిషనర్‌ కోర్టులో వాదించారు. కాగా చెన్నమనేని రమేశ్‌ ఇప్పటికే జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సరైన ఆధారాలు చూపించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దుపై 8 వారాలపాటు హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా కూడా వేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/