రవిప్రకాశ్‌కు షరతులతో కూడిన బెయిల్

Ravi Prakash
Ravi Prakash

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో రవి ప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టీవీ9ను తీసుకున్న తర్వాత సీఈవో పదవి నుంచి రవి ప్రకాశ్‌ను అలంద మీడియా తొలగించింది. ఆ తర్వాత అలంద మీడియాపై రవి ప్రకాశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో అలంద మీడియా పోలీసులను ఆశ్రయించడంతో రవిప్రకాశ్ విచారణకు కూడా హాజరయ్యాడు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/