మరోసారి విచారణకు హాజరైన రవిప్రకాశ్‌

Ravi Prakash
Ravi Prakash

హైదరాబాద్‌: సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట విచారణకు టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ రెండో రోజూ హాజరయ్యారు. ఆయనపై నకిలీ పత్రాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద మీడియా ఫిర్యాదు చేసింది. అయితే నిన్న కూడా రవిప్రకాశ్‌ను ఐదు గంటపాటు పోలీసులు విచారించారు. అనంతరం ఈరోజు కూడ మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/