రవిప్రకాశ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

TS high court
TS high court

హైదరాబాద్‌: టివి9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు వాదనలు ముగిశాయి. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా రవిప్రకాశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున న్యాయవాది అహ్లూవాలియా వాదించారు. శివాజీ, రవిప్రకాశ్‌ మధ్య జరిగిన షేర్ల లావాదేవీలు నిజమేనని, డైరెక్టర్ల నియామకానికి సంబంధించి రవిప్రకాశ్‌ ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని అహ్లూవాలియా వాదనలు విన్పించారు. టివి9 కొనుగోలుకు బ్లాక్‌ మనీ ఉపయోగించారని, రూ. 500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పును రెండు రోజుల పాటు వాయిదా వేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/