రవిప్రకాశ్‌ పొంతనలేని సమాధానాలతో అరెస్టుకు అవకాశం!

ravi prakash
ravi prakash, TV9 ceo

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం!

హైదరాబాద్‌: టివి9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ ఫోర్జరీ వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్‌ అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు రోజులనుంచి విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు విచారణకు రవిప్రకాశ్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల ముందు హాజరయ్యాడు. ఐతే ఆయన విచారణకు సహకరించట్లేదని ఈ రోజు సహకరించకపోతే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
మొదటి రోజు 6 గంటలు, రెండోరోజు 11 గంటలపాటు రవిప్రకాశ్‌ విచరణ కొనసాగింది. ఈ విచారణలో పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాశ్‌ పొంతన లేని జవాబులిస్తున్నారని..గందరగోళపర్చేందుకు రవిప్రకాశ్‌ ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ విచారణ ముగియగానే ఆయనను బంజారా హిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించనున్నట్లు సమాచారం.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/