నేడు బంజారాహిల్స్‌ పిఎస్‌కు రవిప్రకాశ్‌

ravi prakash
ravi prakash

హైదరాబాద్‌: టివి 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ నేడు విచారణ నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. టివి9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్లను అక్రమంగా విక్రయించారనే ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేయడంతో ఆయన ఈ రోజు అక్కడ హాజరయ్యారు. ఏసిపి కేఎస్‌ రావు రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/