బాలికపై తాతయ్య అఘాయిత్యం

 Girl
10th Class Girl

Jagithyala: జగిత్యాలలో సొంత తాతే బాలికపై అఘాయిత్యం చేసిన ఘటన సమాజం తలదించుకునేలా చేసింది. జరిగిన దారుణం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి బాలికను లొంగదీసుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ముసలి మృగాడి దాష్టికం బయటపడింది. ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెతుకుతున్నారు.