కూల్చివేతల, మూసివేతల రారాజు కేసిఆర్‌

Randeep Singh Surjewala
Randeep Singh Surjewala

తెలంగాణ సియం కేసిఆర్‌పై కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. పేదల విద్య గురించి కేసిఆర్‌ ఆలోచించడం లేదని ఆయన మండిపడ్డారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్రంలో ఇప్పటికే 4 వేల ప్రభుత్వ పాఠశాలలను కేసిఆర్‌ ప్రభుత్వం మూసివేయించిందని, మరో 2 వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కూల్చివేతలు, మూసివేతలకు కేసిఆర్‌ మారుపేరుగా నిలిచారని అన్నారు. స్వయం ప్రకటిత రాజుగా కేసిఆర్‌ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/