తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rain
Heavy Rain

హైదరాబాద్‌: ఆగ్నేయ బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో గురు, శుక్ర‌వా‌రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నది. ప్రధా‌నంగా కామా‌రెడ్డి, జన‌గామ, సంగా‌రెడ్డి, మెదక్‌, కుమ్రం భీం ఆసి‌ఫా‌బాద్‌, జోగు‌ళాంబ గద్వాల, జగి‌త్యాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురు‌వొ‌చ్చని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/