రాష్ట్ర‌వ్యా‌ప్తంగా రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Rain fall
Rain fall

హైద‌రా‌బాద్ : ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరా‌లకు దగ్గ‌రలో వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో 4.5 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. గురు‌వారం అక్కడే అల్ప‌పీ‌డనం ఏర్పడే అవ‌కాశం ఉన్నది. వీటి ప్రభా‌వంతో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా గురు, శుక్ర‌వా‌రాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు. ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, పెద్ద‌పల్లి, కరీం‌న‌గర్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, వరం‌గల్‌ అర్బన్‌, వరం‌గల్‌ రూరల్‌, మహ‌బూ‌బా‌బాద్‌, భద్రాద్రి కొత్త‌గూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యా‌పేట జిల్లాల్లో ఒకటి రెండు‌చోట్ల భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/