తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం

Rain
Rain

Hyderabad, Amaravati: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.