తెలంగాణలో మూడు రోజుల పాటు వర్ష సూచన

Rain fall
Rain fall

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆగష్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/