ఆర్టీసీ విలీనంపై రవాణాశాఖ మంత్రి

Puvvada-ajay
Puvvada-ajay

హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పుడు విలీనం హామీ ఇవ్వలేదని పువ్వాడ గుర్తు చేశారు. పూర్తి స్వాయి చర్చలు జరగకుండానే కార్మికులు ఏకపక్షంగా సమ్మెకు వెళ్లారని ఆయన తెలిపారు. ఆర్టీసీ విలీనం సమ్మె అసంబద్ధమని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని ఆయన ప్రశ్నించారు. అయితే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో 7 వేల 358 బస్సులు నడుపుతున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీకి 4416 కోట్ల ఆస్తులున్నాయని ఆయన పేర్కొన్నారు.తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/