ప్రియాంకా హత్యాచార ఘటనలో విస్తుగొలిపే విషయాలు

మద్యం తాగించి మరీ అఘాయిత్యం

Priyanka Reddy
Priyanka Reddy

హైదరాబాద్‌: వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటనలో మరికొన్ని విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి. పంక్చర్ చేయిస్తానని స్కూటీని తీసుకెళ్లిన నిందితుడి కోసం బాధితురాలు వేచి చూస్తుండగా మిగతా నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. షాక్ నుంచి తేరుకున్న వైద్యురాలు ఖహెల్ప్.. హెల్ప్గ అని పలుమార్లు అరిచింది. అయితే, వాహనాల శబ్దం కారణంగా ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. నోరునొక్కి నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను లాక్కెళ్లిన కాసేపటికే స్కూటీ తీసుకెళ్లిన నిందితుడు కూడా వచ్చి వారికి జతకలిశాడు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితురాలు ప్రతిఘటించకుండా ఉండేందుకు బలవంతంగా ఆమె నోరు తెరిచి మద్యం పోశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసిన నిందితులు ఆ తర్వాత ముక్కు, నోరు మూయడంతో ప్రాణాలు కోల్పోయింది.

అంతేకాదు, పోలీసులు వెల్లడించిన మరో విషయం గగుర్పాటుకు గురిచేస్తోంది. మృతదేహాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలోనూ పలుమార్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని లారీలోకి ఎక్కించే క్రమంలో ప్యాంటు లేదని, ఆ తర్వాత ఓ నిందితుడు కిందికెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా నిందితులకు శిక్ష పడేలా చేయాలని, తన కుతురు ఆత్మకు శాంతి చేకూరుతుందని మృతురాలి తండ్రి కోరుకున్నారు. అంతేకాక నిందితుల తరపున న్యాయవాదులెవరూ వాదించొద్దని ప్రియాంక తండ్రి వేడుకంటున్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/