నిజామాబాద్‌ జైలులో ఖైదీ ఆత్మహత్య

Suicide
Suicide

నిజామాబాద్‌: జిల్లా జైలులో వెంకటేష్‌ అనే ఓ ఖైదీ ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. కిటికీకి టవల్ తో ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు అధికారులు తెలిపారు. హత్య కేసులో వెంకటేష్ కు ఇటీవల కోర్టు జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు పడడంతోనే మనస్తాపానికి గురై వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు వెంకటేష్ కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ వాసి అని జైలు అధికారులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం వెంకటేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/