సమ్మక్కను తీసుకొచ్చేందుకు బయల్దేరిన పూజారులు

Medaram jatara
Medaram jatara

మేడారం: తెలంగాణ లో వనదేవతల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర దేశవ్యాప్తంగా పేరుగాంచినది. అయితే ఈ మేడారం జాతరలో ప్రధాన ఘట్టం ఆసన్నమైంది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చేందుకు పూజారులు పయనమయ్యారు. గిరిజనులు సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో చిలకలగుట్టకు వెళ్తున్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్కను మేడారం గద్దెల ప్రాంగణం వద్దకు తీసుకురానున్నారు. అమ్మవారు వచ్చే మార్గంలో ట్రాఫిక్‌ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మేడారం గద్దెల వద్ద భక్తులతో కిటకిటలాడుతోంది. మేడారం జాతరను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/