రాష్ట్రపతి పాలన వలన బిజెపికే మేలు

Asaduddin Owaisi
Asaduddin Owaisi

హైదరాబాద్‌: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది బిజెపికి మాత్రమే మేలు చేస్తుందని ఆయన అభిప్రాయడ్డారు. శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఒకవేళ అవకాశం ఉన్నా తమ పార్టీ మాత్రం వాళ్లకు మద్దతివ్వబోదని ఓవైపీ స్పష్టం చేశారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇచ్చిన గడువు పూర్తికాకుండానే మహరాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి విధించిన డెడ్‌లైన్‌ ఇంకా ముగియకుండానే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫారసు చేస్తారంటూ శివసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సమయం ఇవ్వకపోవడం, రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడంపై శివసేన ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/