గంటసేపు సచివాలయంలో అంధకారం

TELANGANA secretariat
TELANGANA secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం డీ బ్లాక్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాదాపు గంట పాటు సచివాలయం డి బ్లాక్‌లో చీకట్లు అలుముకున్నాయి. ఆ బ్లాక్‌ మొత్తం సెంట్రల్‌ ఏసితో నిర్మితమై ఉండడంతో అందులో వెంటిలేషన్‌ బాగా తక్కువగా ఉంది. విద్యుత్‌ ఉంటే తప్ప అక్కడ పనులు జరగవు. సాంకేతిక సమస్య వల్లే విద్యుత్‌ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఐతే ఇతర బ్లాకుల్లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని, కేవలం డీ బ్లాక్‌లో మాత్రమే ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/