రవిప్రకాశ్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Ravi Prakash
Ravi Prakash

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఏబీసీఎల్‌ షేర్లు అమ్మకంపై ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌)లో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది. అయితే టీవీ 9ను టేకోవర్‌ చేసిన అలంద మీడియా జులై 9వరకు స్టే తెచ్చుకుంది. స్టే సందర్భంగా విచారణ జులై 12కు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీ.. వాదనలు వినిపించాలని చింతలపాటి, ఐల్యాబ్స్‌, అలందమీడియాకు నోటీసులు జారీ చేసింది. రవిప్రకాశ్‌ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ స్వీకరించడాన్ని సవాల్‌ చేస్తూ అలంద మీడియా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/