పూర్తయిన వరంగల్‌ యువతి మృతదేహం పోస్టుమార్టం

Postmortem Completed For young Girl
Postmortem Completed For young Girl

వరంగల్‌: జిల్లాలోని హన్మకొండలో గల రాంనగర్‌లో ఓ ఉన్మాది దాడిలో బలైన యువతి మృతదేహానికి ఈ రోజు పోస్టుమార్టం పూర్తయింది. వరంగల్‌లోని ఎంజిఎం మార్చురీలో యువతి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరంగల్‌లోని రాంనగర్‌లో ఓయువతిని తన స్నేహితుడు షాహిద్‌ ఆమె గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె పథకం ప్రకారం తన గదికి పిలిపించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా గదికి తాళం వేసి వెళ్లిపోయి, పోలీసుల వద్ద లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా తన కూతురిని దారుణంగా హతమార్చిన షాహిద్‌ను కఠినంగా శిక్షించాలని నిందితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/