అరెస్టులు, నిర్భంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు

Ponnala Lakshmaiah
Ponnala Lakshmaiah

వరంగల్‌: తెలంగాణ ఆర్టీసి ఐకాస పిలుపునిచ్చిన సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీసులను రంగంలోకి దించింది. ట్యాంక్‌బండ్‌పైకి వచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నా నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్‌ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. అరెస్టులు, నిర్భంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని, ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్‌ అని పెర్కొన్నారు. ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం అక్రమ అరెస్టులు, హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసి కార్మికుల సమ్మెతోనే సిఎం కెసిఆర్‌ పతనం ప్రారంభం అయిందన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదన్నారు. బంతిని భూమికి కొడితే రెట్టింపు వేగంతో వస్తుందని అదేవిధంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమం ప్రారంభంమవుతుందన్నారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/