ఎన్నికల మేనిఫెస్టోను టిఆర్‌ఎస్‌ తొలగించింది

తాను అడిగే ప్రశ్నలకు సీఎం కెసిఆర్‌ దగ్గర సమాధానం ఉన్నట్లయితే బహిరంగ చర్చకు రావాలి

Ponnala Lakshmaiah
Ponnala Lakshmaiah

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేసి సీఎం కెసిఆర్‌ అధికారంలోకి వచ్చారని పొన్నాల ఆరోపించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫేస్టోను టిఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ నుంచి తొలగించిందని అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉంచామని పొన్నాల పేర్కొన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం కెసిఆర్‌ దగ్గర సమాధానం ఉన్నట్లయితే బహిరంగ చర్చకు రావాలని పొన్నాల సవాల్‌ విసిరారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన నిరుద్యోగ భృతి, రుణమాఫీ, రైతుబంధు, రెండు పడకల గదుల ఇల్లు హామీలను అమలు చేయడంలో టిఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎందుకు అమలు చేయలేదని పొన్నాల ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారని ఆయన మండిపడాడ్డారు.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/