మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌

voters
voters

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో నేటి సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఆయా ప్రాంతాల్లో ఈసీ త్వరగా పోలింగ్‌ను పూర్తి చేసింది. తెలంగాణలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏజెన్సీ గ్రామాలతో పాటు ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. అయితే సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/