ఏపిలో48శాతం, తెలంగాణలో 38.08శాతం పోలింగ్‌

voters
voters

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం నుండి ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపిలో 48శాతం, తెలంగాణలో 38.08 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.08 శాతం పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌లో 20.59 శాతం పోలింగ్‌ నమోదవగా.. సికింద్రాబాద్‌లో 23.85, మల్కాజ్‌గిరిలో 27.07, చేవెళ్ల 29.03, ఆదిలాబాద్‌లో 45.06, నిజామాబాద్‌లో 38.10, మెదక్‌లో 54, జహీరాబాద్‌లో 52.45, మహబూబ్‌నగర్‌లో 44, నాగర్‌కర్నూల్‌లో 45.82, కరీంనగర్‌లో 45.62, పెద్దపల్లిలో 47.50, నల్గొండ 42.09, భువనగిరి 40.99, వరంగల్‌ 40.24, మహబూబాబాద్‌ 47.29, ఖమ్మం 41.65శాతం పోలింగ్‌ నమోదైంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/