చేప మందు పంపిణీ నిలిపివేయాలని పిల్‌

fish prasadam
fish prasadam

హైదరాబాద్‌: చేప మందు పంపిణీపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే చేప మందుపంపిణీ నిలిపివేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎలాంటి శాస్త్రీయత లేకుండా చేప మందు పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొంది. చేప మందు కోసం ప్రభుత్వం అనవసరంగా డబ్బులను వృధా చేస్తుందని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో తెలిపారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/